Ben Stokes: వన్డే ప్రపంచకప్ కోసం బెన్ స్టోక్స్ యూటర్న్
- వన్డే వరల్డ్ కప్ 2023లో పాల్గొనే అవకాశం
- గతేడాది వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన స్టోక్స్
- వచ్చే ఐపీఎల్ లో పాల్గొనడంపై సందేహాలు
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ యూ టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే క్రికెట్ కు గతేడాది జులైలో స్టోక్స్ గుడ్ పై చెప్పేశాడు. అయితే, వన్డే కప్ కు అందుబాటులో ఉండాలంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ స్టోక్స్ ను అభ్యర్థించింది. దేశానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే అతడు, ఇంగ్లండ్ తరఫున వన్డే వరల్డ్ కప్ 2023లో పాలు పంచుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్ లో వన్డే ప్రపంచకప్ జరగనుండడం తెలిసిందే.
వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్, అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా గత వన్డే వరల్డ్ కప్ ఫైనలిస్ట్ న్యూజిలాండ్ తో తలపడనుంది. ప్రస్తుతం బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ గా సేవలు అందిస్తున్నాడు. వన్డే కెప్టెన్ జోస్ బట్లర్ కోరితే ప్రపంచకప్ 2023లో పాల్గొనాలన్నది స్టోక్స్ అభిమతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇంగ్లండ్ జట్టుకు మరింత బలం చేకూరినట్టు అవుతుంది.
బెన్ స్టోక్స్ వచ్చే ఐపీఎల్ కు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే జనవరి 25 నుంచి మార్చి వరకు భారత్ తో ఇంగ్లండ్ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో పాల్గొంటోంది. ఐపీఎల్ లో కూడా పాల్గొంటే మే వరకు భారత్ లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఐదు నెలల పాటు ఇక్కడ ఉండడం అసాధ్యమని తెలుస్తోంది. ఐపీఎల్ విండోలో విరామం తీసుకుని, మోకాలికి సర్జరీ చేయించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.