Suriya: ముంబైకి మకాం మార్చినట్టు రూమర్లు.. స్పందించిన నటుడు సూర్య

Is Suriya shifting to Mumbai with Jyothika and their kids

  • ఆ వార్తల్లో నిజం లేదన్న సూర్య
  • చదువు కోసం తన కుమార్తె, కొడుకు మాత్రమే అక్కడ ఉంటున్నారని స్పష్టీకరణ
  • ప్రస్తుతం ‘కంగువ’ సినిమాలో నటిస్తున్న సూర్య

ముంబైకి షిప్ట్ అయినట్టు వస్తున్న వార్తలపై కోలీవుడ్ నటుడు సూర్య స్పందించారు. ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొన్న సూర్యను కుటుంబంతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యారన్న రూమర్లపై స్పందించమని కోరగా.. నేరుగా సమాధానం చెప్పారు. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదన్నారు. తన కుమార్తె, కొడుకు చదువు కోసం ముంబైలో ఉన్నారని, తాను మాత్రం తమిళనాడులోనే ఉంటున్నట్టు స్పష్టం చేశారు. తాను మంచి కొడుకుగా, మంచి నాన్నగా, మంచి భర్తగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. జీవితంలో ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్న తపనతో నటుడు మాధవన్‌తో కలిసి కొన్ని రోజులుగా గోల్ఫ్ ఆడుతున్నట్టు సూర్య వివరించారు.

సూర్య ప్రస్తుతం ‘కంగువ’ అనే సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య విభిన్న వేషాల్లో కనిపించనున్నారు. హీరోయిన్‌గా దిశా పటానీ నటిస్తున్నారు. త్రీడీలో వస్తున్న ఈ సినిమా 10కిపైగా భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది.

Suriya
Kollywood
Jyothika
Mumbai
Tamil Nadu
  • Loading...

More Telugu News