Pakistan: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాక్‌కు ఘోర అవమానం
- ఓ రోజు తేడాలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న దాయాది దేశం
- బుర్జ్ ఖలీఫాపై ఆవిష్కృతమయ్యే తమ జెండాను చూసుకునేందుకు భారీగా చేరుకున్న పాకిస్థానీయులు
- అర్ధారాత్రి దాటినా బుర్జ్ ఖలీఫాపై జెండా కనిపించకపోవడంతో తీవ్ర నిరాశ
- ఎప్పటిలాగే బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శితమైన భారత త్రివర్ణ పతాకం
- సోషల్ మీడియాలో తమ ఆవేదన వెళ్లబోసుకుంటున్న పాకిస్థానీయులు
నిన్న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న పాక్‌కు ఘోర అవమానం జరిగింది. తమకు ఎదురైన తలవంపులు తట్టుకోలేక పాకిస్థానీయుల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మా బతుకులు ఇలా అయిపోయాయంటూ ఓ మహిళ భావోద్వేగానికి లోనైంది. పాక్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఆ దేశ జాతీయ జెండా దుబాయ్‌లోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవంతిపై కనిపించకపోవడమే దీనికి కారణం.
స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే దేశాల జాతీయ జెండాలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈమారు తమ జెండాను చూసుకునేందుకు పాక్ జాతీయులు పెద్ద ఎత్తున బుర్జ్ ఖలీఫా వద్దకు చేరుకున్నారు. అయితే, అర్ధరాత్రి దాటినా కూడా తమ జెండా కనిపించకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందారు. కానీ, భారత జాతీయ జెండా మాత్రం యథాతథంగా ప్రదర్శితమైంది. తీవ్ర నిరాశకు లోనైన పాకిస్థానీయులు దుబాయ్ అదికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మా బతుకులు ఇలా అయిపోయాయంటూ ఓ మహిళ భావోద్వేగానికి లోనయ్యారు.