sv university: ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం... హడలిపోయిన విద్యార్థులు

Chirutha in SV university premises

  • ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చిరుతను చూసిన విద్యార్థులు
  • వెంటనే గ్రౌండ్ నుండి పరుగులు తీసిన విద్యార్థులు
  • వేద విశ్వవిద్యాలయంలోనూ రాత్రి చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం చేసింది. దీంతో ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చిరుతను చూసి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులు వెంటనే గ్రౌండ్ నుండి పరుగులు తీశారు. వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించింది. అటు, వేద విశ్వవిద్యాలయంలోనూ రాత్రి చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అంతకుముందు, తిరుమలలోని శ్రీవారి మెట్టు నడకమార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఉదయం 2 వేల మెట్టు వద్ద భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. సమీపంలోని అటవీ ప్రాంతం నుండి రావడాన్ని గుర్తించిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు.

sv university
Tirumala
Tirupati
  • Loading...

More Telugu News