Soul Of Satya: సాయిధరమ్ తేజ్ 'సోల్ ఆఫ్ సత్య' గీతాన్ని విడుదల చేయనున్న రామ్ చరణ్

Ram Charan will release Soul Of Satya song on tomorrow
  • నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో 'సత్య' మ్యూజికల్ షార్ట్ ఫిలిం
  • దేశం కోసం సైనికుడి త్యాగాల సమాహారమే ఈ సోల్ ఆఫ్ సత్య
  • ప్రధానపాత్రల్లో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి 
విరూపాక్ష, బ్రో చిత్రాలతో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ 'సత్య' అనే మ్యూజికల్ షార్ట్ ఫిలింలో నటించారు. ఈ షార్ట్ వీడియో చిత్రానికి సాయిధరమ్ తేజ్ మిత్రుడు నవీన్ విజయ్ కృష్ణ (నటుడు నరేశ్ తనయుడు) దర్శకత్వం వహించారు.

 ఈ వీడియో లఘు చిత్ర నిర్మాణంలో సాయిధరమ్ తేజ్ తన మిత్రులతో కలిసి పాలుపంచుకున్నారు. ఓ సైనికుడు తన దేశం కోసం చేసే త్యాగాలను ఈ షార్ట్ ఫిలింలో చూపించనున్నారు. గాయని శృతి రంజని ఈ వీడియో చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో సాయిధరమ్ తేజ్ సరసన కలర్స్ స్వాతి నటించారు. 

కాగా, 'సోల్ ఆఫ్ సత్య' గీతాన్ని భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'గ్లోబల్ స్టార్' రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు సోల్ ఆఫ్ సత్యా పాటను రామ్ చరణ్ ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది.
Soul Of Satya
Ram Charan
Song
Musical Short Video
Sai Dharam Tej
Colours Swathi

More Telugu News