Vidadala Rajini: పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది: ఏపీ మంత్రి విడదల రజని

Vidadala Rajini counter to Pawan Kalyan

  • ప్రభుత్వంపై పవన్ చేసేవి తప్పుడు ఆరోపణలని వ్యాఖ్య
  • రుషికొండపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న రజని
  • కోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే అంతా జరుగుతోందని వెల్లడి

రుషికొండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి విడదల రజని స్పందించారు. ఆమె సోమవారం మాట్లాడుతూ... ప్రభుత్వంపై జనసేనాని చేసేవి తప్పుడు ఆరోపణలు అన్నారు. రుషికొండపై ఆయన చేస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే అంతా సాగుతోందన్నారు. పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.

అంతకుముందు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణను బహిష్కరించిన వ్యక్తి ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని టీడీపీ అధినేత చూస్తున్నారన్నారు. ప్రధాని, రాష్ట్రపతిలకు చంద్రబాబు లేఖ రాశారని, కానీ ఎందుకు రాశారో తెలియదన్నారు. పుంగనూరు ఘటనలో పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఈ సంఘటనలో వైసీపీ నేతలు లేరన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను జనసేనాని చదువుతున్నారని విమర్శించారు.

Vidadala Rajini
Pawan Kalyan
Janasena
YSRCP
  • Loading...

More Telugu News