Instagram: ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ విషయంలో గొడవ, భార్యను చంపేసిన భర్త

Man strangles wife over her insta followers

  • ఇన్‌స్టాలో భార్యకు అత్యధిక ఫాలోవర్లు.. భర్తను బ్లాక్ చేసిన భార్య
  • ఈ విషయమై పలుమార్లు ఇరువురి మధ్య గొడవ
  • ఆదివారం బయటకు వెళ్లిన సమయంలో వాగ్వాదం.. గొంతు కోసి చంపేసిన భర్త

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. లక్నోకు చెందిన 37 ఏళ్ల ఓ వ్యాపారవేత్త తన పిల్లల ముందే భార్యను హత్య చేసిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం పిల్లలతో కలిసి భార్యాభర్తలు అలా బయటకు వెళ్లారు. కారులోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి హత్యకు దారి తీసింది. వీరికి 12 ఏళ్ల కూతురు, 5 ఏళ్ల కొడుకు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. దీనికి తోడు ఆమె తన భర్తను ఇన్‌స్టాలో బ్లాక్ చేసింది. ఇందుకు సంబంధించి ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు అయ్యాయి.

తన భార్యకు ఎవరితోనే ఎఫైర్ ఉందనే అనుమానం భర్తకు వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం వారు తమ ఎస్‌యూవీ కారులో రాయ్‌బరేలికి బయలుదేరారు. అయితే మధ్యలోనే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే వైపు కారును తిప్పాడు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం జరగగా.. గొంతు కోసి చంపేశాడు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి చూడగా హత్య విషయం వెలుగు చూసింది. తమ ముందే తల్లిని చంపారని ఆ పిల్లలు పోలీసులకు చెప్పారు. దీంతో భర్తను అరెస్ట్ చేశారు.

Instagram
Uttar Pradesh
Crime News
  • Loading...

More Telugu News