Virupaksha: మళ్లీ జట్టు కట్టిన విరూపాక్ష బృందం.. ఈసారి మైథికల్ థ్రిల్లర్​

The Team Of  Virupaksha is back

  • సాయితేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష
  • కార్తిక్ దండు దర్శకతంలో వచ్చిన చిత్రం సూపర్ హిట్
  • కార్తిక్, సుకుమార్, బీవీఎస్‌ఎన్‌ కాంబినేషన్‌లో 
    రాబోతున్న మరో సినిమా

ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ అందుకున్న చిత్రం విరూపాక్ష. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా కార్తిక్‌ దండు దర్శకుత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌తో పాటు భారీ కలెక్షన్లు సాధించింది. సుకుమార్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి చేతులు కలిపింది. దర్శకుడు కార్తిక్‌ దండు, సుకుమార్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఈ రోజు సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. 

అన్వేషణలో భాగంగా ముగ్గురు వ్యక్తులు గుహల్లో వేలాడుతున్నట్లు పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ఇది మైథికల్ థ్రిల్లర్ అని పోస్టర్ లో చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉందని తెలిపింది. అయితే ఇది విరూపాక్షకు సీక్వెలా? లేక కొత్త చిత్రమా? అన్నది తెలియాల్సి ఉంది. హీరో ఎవరనేది కూడా ఇంకా వెల్లడించలేదు. హీరో, హీరోయిన్, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.

Virupaksha
team
sukumar
Sai Dharam Tej
bvsn prasad
karthik dandu

More Telugu News