Sekhar Kammula: శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్‌గా రష్మిక

Rashmika Mandanna joins Dhanush and Sekhar Kammula film
  • ధనుష్ హీరోగా రాబోతున్న చిత్రం
  • తమిళ స్టార్ కెరీర్‌‌లో ఇది 51వ సినిమా
  • ప్రస్తుతం రష్మిక చేతిలో ‘పుష్ప2’, ‘యానిమల్’ చిత్రాలు
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ నటి రష్మిక మందన్న జోరు నడుస్తోంది. వరుసగా భారీ సినిమాలతో ఆమె క్షణం తీరిక లేకుండా ఉంది. అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2', రణబీర్ కపూర్ తో బాలీవుడ్‌ లో 'యానిమల్' సినిమా చేస్తోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో భారీ ఆఫర్ చేరింది. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తమిళ స్టార్ ధనుష్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ధనుష్ కు ఇది 51వ సినిమా. 

ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్న ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. రష్మికకు స్వాగతం చెబుతూ ఓ పోస్టర్‌‌ ను విడుదల చేసింది. ఈ క్రేజీ ఆఫర్‌‌ తో రష్మిక చాలా సంతోషంగా ఉంది. సదరు పోస్టర్‌‌ ను ఫ్రేమ్ చేయించి ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది.
Sekhar Kammula
Rashmika Mandanna
Dhanush

More Telugu News