tirumala: తిరుమల మెట్ల మార్గంలో మొన్న చిరుత.. ఇప్పుడు ఎలుగుబంటి కలకలం!

pilgrims saw A bear on tirumala Srivari steps

  • ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురైన భక్తులు
  • వెంటనే అధికారులకు సమాచారం అందజేత  
  • జాగ్రత్తగా వెళ్లాలని మిగతా భక్తులకు సూచన
  • తిరిగి అడవిలోకి వెళ్లిపోయిన ఎలుగు

తిరుమల అలిపిరి నడకదారిలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం 2 వేల నంబర్ మెట్టు దగ్గర భక్తులకు ఎలుగు కనిపించింది.

అడవిలో నుంచి ఎలుగు రావడాన్ని గుర్తించిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు మైకుల్లో ప్రకటన చేశారు. నడక దారిలో వస్తున్న మిగతా భక్తులను అప్రమత్తం చేశారు. ఎలుగుబంటి తిరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఎలుగు తిరిగి అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

tirumala
bear
pilgrims
TTD
leopard
  • Loading...

More Telugu News