Tollywood: పెళ్లి పీటలు ఎక్కనున్న విష్వక్సేన్!

Vishwak Sen going to start family soon

  • ఫ్యామిలీని స్టార్ట్ చేయబోతున్నానంటూ ట్వీట్
  • వివరాలు త్వరలో వెల్లడిస్తానన్న యువ నటుడు
  • ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో హీరోగా చేస్తున్న విష్వక్

టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ హీరోల్లో విష్వక్సేన్ ముందుంటాడు. హీరోగానే కాకుండా దర్శకుడిగానూ తనను తాను నిరూపించుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం విష్వక్సేన్ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కృష్ణచైతన్య దర్శకత్వం‌ వహిస్తున్న ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. విష్వక్ లుంగీ కట్టుకొని మాస్ లుక్‌ లో కనిపించిన టీజర్ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా కుటుంబాన్ని మొదలు పెట్టబోతున్నానంటూ విష్వక్సేన్ నిన్న చేసిన ఓ ట్వీట్  టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

‘ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమ, మద్దతుకు నా అభిమానులు, శ్రేయోభిలాషులకు సర్వదా కృతజ్ఞుడిని. ఇప్పుడు జీవితంలో మరో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలియజేసేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను ఫ్యామిలీ మొదలెట్టబోతున్నాను. వివరాలు త్వరలోనే’ అని తెలుపుతూ అబ్బాయి, అమ్మాయి కలిసున్న ఎమోజీని ఉంచాడు. దీన్ని బట్టి విష్వక్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని అర్థం అవుతోంది.

Tollywood
Vishwak Sen
wedding
family
  • Loading...

More Telugu News