Rohit Sharma: కుటుంబ సమేతంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ

Team India captain Rohit Sharma visits Tirumala along with his family

  • వెస్టిండీస్ టెస్టు, వన్డే సిరీస్ ముగిసిన అనంతరం భారత్ తిరిగొచ్చిన రోహిత్ శర్మ
  • ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారి దర్శనం
  • తీర్థప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు

ఇటీవల వెస్టిండీస్ తో టెస్టు, వన్డే సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా సారథి రోహిత్ శర్మ భారత్ తిరిగొచ్చాడు. రోహిత్ శర్మ ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నాడు. వీఐపీ బ్రేక్ సమయంలో భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరాలతో కలిసి స్వామివారిని సేవించుకున్నాడు. 

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కాగా, స్వామివారి ఆలయంలో రోహిత్ శర్మ కుటుంబానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనాలతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

More Telugu News