Vijay Sai Reddy: 'తెలుగు తమ్ముళ్లూ, జర భద్రం' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్
- ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టే 2019లో మిమ్మల్ని 23కు దించేశారని వ్యాఖ్య
- పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పాతాళానికి తొక్కేశారని ఎద్దేవా
- 2024 నాటికి మరింత అప్రమత్తతతో పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేస్తారన్న ఎంపీ
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో సున్నా సీట్లకు పడిపోతుందని ట్వీట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టే 2019లో మిమ్మల్ని 23కు దించేశారని టీడీపీని ఉద్దేశించి శనివారం ట్వీట్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పాతాళానికి తొక్కేశారని, 2024 నాటికి మరింత అప్రమత్తతతో పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేస్తారని పేర్కొన్నారు. అప్పుడు మిగిలేది టీడీపీకి 0/175 అన్నారు. తెలుగు తమ్ముళ్లు జరభద్రం అంటూ ట్వీట్ ముగించారు.
ఉదయం కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అధికారంలోకి వస్తే వారి అంతుచూస్తా, వీరికి తోక కత్తిరిస్తా, వారి సాయంతో వీరిని కంట్రోల్ చేస్తా, ప్రకృతిని నియంత్రిస్తా, అది చేయనివ్వను.. ఇది చేయనివ్వనంటూ టీడీపీ, విపక్ష నేతలు రోడ్లపై, ఇళ్ల పైకప్పులెక్కి అరుస్తున్నారని, ఇందుకోసమా ప్రజలు మీకు ఓట్లెయ్యలి? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.