TTD: తిరుమల నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్

TTD announces high alert zone in Alipiri foot way

  • తిరుమల నడకదారిలో విషాదాంతం
  • చిరుత దాడిలో బాలిక మృతి
  • కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
  • నడకదారిలో ప్రతి 100 మంది భక్తులను బృందంగా పంపనున్నట్టు వెల్లడి
  • ముందు, వెనుక రోప్ లతో రక్షణ 
  • పైలెట్ గా భద్రతా సిబ్బంది నియామకం

తిరుమల అలిపిరి నడకమార్గంలో లక్షిత అనే బాలికను చిరుతపులి బలిగొనడం అందరినీ కలచివేస్తోంది. ఇటీవలే ఓ బాలుడిపై చిరుత దాడి చేసినా, అదృష్టవశాత్తు ఆ బాలుడు బతికిబయటపడ్డాడు. కానీ లక్షిత ఉదంతం విషాదాంతం అయింది. 

ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్ గా టీటీడీ ప్రకటించింది. ఈ హై అలర్ట్ జోన్ లో ప్రతి 100 మంది భక్తులను ఓ బృందంగా పంపిస్తారు. భక్తులకు ముందు భాగంలోనూ, వెనుక భాగంలో రోప్ లతో రక్షణ కల్పిస్తారు. ఈ బృందానికి పైలెట్ గా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది.

  • Loading...

More Telugu News