Dharmana Prasad: ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురి కావడానికి మీరు కారణం కాదా?: చంద్రబాబుకి ధర్మాన ప్రశ్న

Chandrababu neglected projects says Dharmana Prasad
  • 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేశారా? అని ప్రశ్న
  • వంశధారను డిసెంబర్ లో జాతికి అంకితం చేస్తామని వెల్లడి
  • చంద్రబాబు విద్యుత్ ఛార్జీలను ఎందుకు తగ్గించలేదని ప్రశ్న
ప్రాజెక్టులను సందర్శించిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాస్త అవగాహనతో వచ్చి మాట్లాడితే బాగుంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురి కావడానికి మీరు బాధ్యులు కాదా? అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన మీరు... ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని అడిగారు. మీరు ఏమీ చేయకుండా... నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వంపై నిందలు వేస్తారా? అని ప్రశ్నించారు.

వంశధార పనులు 77 శాతం పూర్తయ్యాయని... డిసెంబర్ లో జాతికి అంకితం చేస్తామని చెప్పారు. కిడ్నీ వ్యాధుల నిర్మూలనకు వంశధార నుంచి ఉద్ధానంకు నీటిని అందిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళంపై చాలా ప్రేమ ఉన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చంద్రబాబు అంటున్నారని... మరి, గతంలో విద్యుత్ ఛార్జీలను ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు.
Dharmana Prasad
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News