World Highest Grossing Companies: ప్రపంచంలోనే అత్యంత అధిక టర్నోవర్ కలిగిన 10 కంపెనీలు ఇవే.. తొలి స్థానంలో వాల్ మార్ట్!

The Worlds Highest grossing Companies

  • ఏడాదికి 611 బిలియన్ యూఎస్ డాలర్ల రెవెన్యూతో వాల్ మార్ట్
  • 604 బియన్ డాలర్లతో రెండో స్థానంలో సౌదీ ఆరామ్ కో
  • జాబితాను ప్రకటించిన స్టాటిస్టా కంపెనీ డేటాబేస్

ప్రపంచంలోనే అత్యంత అధిక టర్నోవర్ కలిగిన  కంపెనీగా ప్రముఖ రిటైల్ సంస్థ వాల్ మార్ట్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఏడాదికి 611 బిలియన్ డాలర్ల కళ్లు చెదిరే రెవెన్యూతో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్ కో నిలిచింది. ఈ వివరాలను స్టాటిస్టా కంపెనీ డేటాబేస్ వెల్లడించింది. ఈ జాబితాలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. టెక్నాలజీ రంగం నుంచి కేవలం యాపిల్ కు మాత్రమే స్థానం దక్కింది. గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీలకు జాబితాలో స్థానం దక్కకపోవడం గమనార్హం. 

అత్యంత  అధిక టర్నోవర్ సాధించిన (హైయ్యెస్ట్ గ్రాసింగ్) టాప్ 10 కంపెనీలు ఇవే:

  • వాల్ మార్ట్ - రీటెయిల్ - 611 బిలియన్ యూఎస్ డాలర్లు
  • సౌదీ ఆరామ్ కో - ఆయిల్ అండ్ గ్యాస్ - 604 బిలియన్ డాలర్లు
  • అమెజాన్ - ఈ కామర్స్ - 514 బిలియన్ డాలర్లు
  • విటోల్ - ఆయిల్ అండ్ గ్యాస్ - 505 బిలియన్ డాలర్లు
  • పెట్రో చైనా - ఆయిల్ అండ్ గ్యాస్ - 502 బిలియన్ డాలర్లు
  • సీఎన్పీసీ - ఆయిల్ అండ్ గ్యాస్ - 474 బిలియన్ డాలర్లు
  • ఎక్సాన్ మొబిల్ - ఆయిల్ అండ్ గ్యాస్ - 399 బిలియన్ డాలర్లు
  • యాపిల్ - టెక్నాలజీ - 394 బిలియన్ డాలర్లు
  • స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా - 384 బిలియన్ డాలర్లు
  • షెల్ - ఆయిల్ అండ్ గ్యాస్ - 381 బిలియన్ డాలర్లు

World Highest Grossing Companies
Wallmart
Saudi Amamco
Amazon
  • Loading...

More Telugu News