V Srinivas Goud: ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు

Case Against Telangana Minister V Srinivas Goud In Mahbubnagar

  • మరో 10 మంది అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు
  • 2018 ఎన్నికల్లో అఫిడవిట్ ట్యాంపరింగ్ ఆరోపణలు
  • కేసు నమోదు చేయాలని గతంలోనే ఆదేశించినా పట్టించుకోని పోలీసులు
  • కోర్టు హెచ్చరికల నేపథ్యంలో నిన్న కేసు నమోదు 

ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు మరో 10 మంది మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో నిన్న కేసు నమోదైంది. 2018 ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్ అఫిడవిట్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని మహబూబ్‌నగర్‌కు చెందిన చలువగాలి రాఘవేంద్రరాజు హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు.

విచారించిన న్యాయస్థానం, మంత్రి, ఇందుకు బాధ్యులైన 10 మంది అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సెప్టెంబరు 11లోగా విచారణ నివేదిక సమర్పించాలని జులై 11న పోలీసులను ఆదేశించింది. అయితే, ఈ ఉత్తర్వులను పోలీసులు పట్టించుకోకపోవడంతో రాఘవేంద్రరాజు మరోమారు కోర్టును ఆశ్రయించారు. 

నిన్న వాదనలు విన్న న్యాయస్థానం సాయంత్రంలోగా మంత్రి, అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. లేదంటే కోర్టు తీర్పు ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించడంతో పోలీసులు శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు 10 మంది అధికారులపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News