Ram Gopal Varma: పొగడ్తల విషం నుండి 'మెగా' తప్పించుకోవాలి: రామ్ గోపాల్ వర్మ ట్వీట్

Ram Gopal Varma tweet on Megastar Chiranjeevi film

  • పొగడ్తలతో ముంచెత్తేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు
  • జబర్, హైపల్ లాంటి ఆస్థాన విదూషకుల భజనకి అలవాటుపడి రియాల్టీకి దూరమవుతున్నారని వ్యాఖ్య
  • పొగడ్తలతో ముంచెత్తే బ్యాచ్ కంటే ప్రమాదకరమైనవాళ్లు ఉండరన్న ఆర్జీవీ

పొగడ్తలతో ముంచెత్తేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం మెగాస్టార్ చిరంజీవికి పరోక్షంగా సూచించారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా శుక్రవారం విడుదలైంది. తమిళ హిట్ మూవీ వేదాళంకి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ (ఎక్స్) చేశారు.

జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల  భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోందని పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. పొగడ్తలతో ముంచే బ్యాచ్ కంటే ప్రమాదకరమైన వాళ్ళు ఉండరని, రియాల్టీ తెలిసే లోపల రాజుగారు మునిగిపోతారని, వాళ్ళ పొగడ్తల విషం నుండి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైలు దూరం పెట్టడమేనని సూచించారు.

Ram Gopal Varma
chiranjeevi
bhola shankar
  • Loading...

More Telugu News