Disha: శంషాబాద్ లో దిశ తరహా ఘటన.. మహిళను హత్య చేసి కాల్చేసిన దుండగులు

Disha like murder in shamshabad

  • సాయి ఎన్ క్లేవ్ లో ఇళ్ల స్థలాల మధ్య మృతదేహం లభ్యం
  • కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఎయిర్ పోర్టు పోలీసులు
  • పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గతంలో రాష్ట్రంతోపాటు దేశాన్ని కుదిపివేసిన దిశ ఉదంతం మాదిరి మహిళ దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సదరు మహిళకు 35 - 36 ఏళ్లు ఉండొచ్చని, కాళ్లకు మెట్టెలు ఉండటంతో వివాహితగా భావిస్తున్నారు. 

ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. ఆ మహిళ ఎవరు? ముందుగానే చంపేసి అక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా? అత్యాచారం ఏమైనా జరిగిందా? అనే అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేసు విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

Disha
murder
women
shamshabad
police
  • Loading...

More Telugu News