G. Kishan Reddy: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసిన చికోటి ప్రవీణ్

Chikoti Praveen meets Kishan Reddy

  • ఢిల్లీలో వరుసగా నేతలను కలుస్తున్న క్యాసినో కింగ్
  • గతంలో బండి సంజయ్ సహా పలువురితో భేటీ అయిన చికోటి
  • వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తితో ఉన్నట్లుగా జోరుగా ప్రచారం

భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని గురువారం క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్, అంబర్ పేట శంకర్ కలిశారు. ఇటీవల చికోటి ఢిల్లీలో వరుసగా బీజేపీ నేతలను కలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కిషన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, రామచంద్రరావు, డీకే అరుణ తదితరులను కూడా కలిశారు. హిందూ ధర్మ రక్షణ, గో రక్షక్ నినాదంతో చికోటి ముందుకు సాగుతున్నారు.

G. Kishan Reddy
chikoti praveen
Telangana
  • Loading...

More Telugu News