Team India: వన్డే మ్యాచ్‌లో రికార్డు డబుల్ సెంచరీ కొట్టిన పృథ్వీ షా

Prithvi Shaw shatters records with 244 against Somerset

  • ఫామ్‌ కోల్పోయి టీమిండియాకు దూరమైన ఓపెనర్
  • కౌంటీ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్ క్లబ్‌కు ఆడుతున్న షా
  • సోమర్‌‌సెట్‌తో మ్యాచ్‌లో 153 బంతుల్లోనే 244 పరుగులతో రికార్డు

ఫామ్ కోల్పోయి భారత జట్టుకు దూరమైన ముంబై ఆటగాడు, ఓపెనర్ పృథ్వీ షా  కౌంటీల్లో దుమ్మురేపుతున్నాడు. ఇంగ్లండ్ వన్డే కప్‌ టోర్నీలో రికార్డు డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. నార్తాంప్టన్‌షైర్‌ క్లబ్‌ కు ఆడుతున్న పృథ్వీ షా నిన్న సోమర్‌ సెట్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో తన విశ్వరూపం చూపెట్టాడు. ఈ పోరులో ఓపెనర్‌‌గా బరిలోకి దిగిన పృథ్వీ 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్సర్లతో విరుచుకుపడి 244 పరుగులు సాధించాడు. దాంతో, లిస్ట్ –ఎ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్ తరపున అత్యధిక స్కోరు సాధించాడు.

ఇంగ్లండ్ లిస్ట్–ఎ క్రికెట్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఆరో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే 50 ఓవర్ల ఫార్మాట్‌లో తన అత్యుత్తమ స్కోరును షా అధిగమించాడు. 2021లో జైపూర్‌లో పుదుచ్చేరిపై ముంబై తరఫున 227 పరుగుల రికార్డును మెరుగు పరుచుకున్నాడు.

Team India
Cricket
Prithvi Shaw
record
double century
  • Loading...

More Telugu News