Bollywood: డాన్3 వస్తోంది.. హీరోగా రణ్​వీర్ సింగ్!

Ranveer singh hero in DON3

  • షారుక్ ఖాన్ హీరోగా తొలి రెండు పార్టులు
  • ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో వస్తున్న డాన్‌3
  • టైటిల్, టీజర్‌‌ విడుదల చేసిన చిత్ర బృందం

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌ కథానాయకుడిగా ‘డాన్‌’ ఫ్రాంఛైజీలో వచ్చిన రెండు చిత్రాలు ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్‌ చిత్రాలు భారీ వసూళ్లు కూడా రాబట్టాయి. దాంతో, ఈ ఫ్రాంఛైజీలోని మూడో భాగం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. డాన్‌3 వస్తోందంటూ దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్ కొన్ని రోజుల కిందట ప్రకటించి, ఆసక్తిని పెంచారు.

తాజాగా మూడో భాగం టైటిల్, టీజర్‌‌ను విడుదల చేసింది. అయితే, ఇందులో రణ్‌ వీర్‌సింగ్‌ కనిపించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. డాన్‌3లో షారుక్ బదులు రణ్ వీర్ సింగ్‌ హీరోగా నటిస్తున్నారు. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

Bollywood
Shahrukh Khan
don3
ranveer singh

More Telugu News