Andhra Pradesh: ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Andhra Pradesh files petition in Supreme Court

  • హైకోర్టు ఇచ్చిన స్టేపై సర్వోన్నత న్యాయస్థానంలో ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు 
  • పిటిషన్‌కు రిజిస్ట్రీ డైరీ నెంబర్‌ను కేటాయించిన సుప్రీంకోర్టు
  • తమ వాదనలూ వినాలని కోరుతున్న రైతులు

అమరావతి ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన స్టేపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ డైరీ నెంబర్‌ను కేటాయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినాలని అమరావతి రైతులు కోరుతున్నారు. ఇప్పటికే వారు సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు.

Andhra Pradesh
AP High Court
Supreme Court
Amaravati
  • Loading...

More Telugu News