Chiranjeevi: 'మహానటి' ముందు జాగ్రత్తగా ఉండాల్సిందే .. లేకపోతే తినేస్తుంది: చిరంజీవి

Bhola Shankar team interview

  • ఈ నెల 11వ తేదీన 'భోళాశంకర్'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ 
  • కీర్తి సురేశ్ నటన పట్ల ప్రశంసలు 
  • పవన్ ను ఇమిటేట్ చేయడం గురించి ప్రస్తావన

చిరంజీవి కథానాయకుడిగా 'భోళాశంకర్' సినిమా రూపొందింది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి .. తమన్నా .. కీర్తి సురేశ్ పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ .. "కీర్తి సురేశ్ వాళ్ల మదర్ 'మేనక' నాకు మంచి ఫ్రెండ్. అదే అనుబంధం కీర్తి సురేశ్ తో కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో చెల్లెలి సెంటిమెంట్ చాలా కొత్తగా .. బలంగా ఉంటుంది. తన పెర్ఫార్మెన్స్ తో కీర్తి నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది" అన్నారు. 

"కీర్తి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తను 'మహానటి' .. తన ముందు జాగ్రత్తగా లేకపోతే తినిపారేస్తుంది. తమన్నాతో చేసే డాన్సులను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే పవన్ ను ఇమిటేట్ చేసే సీన్ కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. పవన్ ను ఇమిటేట్ చేసే సందర్భాన్ని నేను ఎంజాయ్ చేశాను" అంటూ చెప్పుకొచ్చారు. 

Chiranjeevi
Thamannah
Keerthi Suresh
Bhola Shankar
  • Loading...

More Telugu News