Narendra Modi: 'ఇండియా' కూటమి నిన్నటి సెమీఫైనల్స్ లోనే ఓడిపోయింది: ప్రధాని మోదీ ఎద్దేవా

Modi satires on INDIA alliance

  • ఇండియా పేరిట కూటమి కట్టిన విపక్షాలు
  • విపక్షాలను మరోసారి టార్గెట్ చేసిన ప్రధాని మోదీ
  • ఇండియా కూటమికి నిన్న రాజ్యసభలో సెమీఫైనల్స్ అని వెల్లడి
  • సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత విపక్షాలకు లేదని విమర్శలు

విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A)పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి, అవకాశవాద రాజకీయాలు, కుటుంబ పాలన నుంచి దేశానికి విముక్తి లభించాలని పేర్కొన్నారు. నిన్న రాజ్యసభలో విపక్ష ఇండియా కూటమికి సెమీఫైనల్స్ ఎదురయ్యాయని వెల్లడించారు. కానీ ఇండియా కూటమి సెమీఫైనల్స్ లోనే ఓడిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత విపక్షాలకు లేదని స్పష్టం చేశారు ఇండియా కూటమి వల్లే సామాజిక న్యాయానికి నష్టం వాటిల్లుతోందని అన్నారు.

Narendra Modi
INDIA
BJP
NDA
Opposition Alliance
Semifinals
Rajya Sabha
Parliament
India
  • Loading...

More Telugu News