Raja Singh: క్రిస్టియన్ ను టీటీడీ ఛైర్మన్ చేశారు: జగన్ పై రాజాసింగ్ ఫైర్

Jagan appointed Chistian as TTD chairman says Raja Singh
  • హిందూ ధర్మంపై జగన్ కు ఎందుకంత కోపమని ప్రశ్నించిన రాజాసింగ్
  • ఎన్నికల అఫిడవిట్ లో క్రిస్టియన్ గా భూమన పేర్కొన్నారని వ్యాఖ్య
  • ఏపీలో హిందువులు మేల్కోకపోతే నష్టం తప్పదని హెచ్చరిక
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు హిందూ ధర్మంపై ఎందుకంత కోపమని తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో క్రిస్టియన్ గా పేర్కొన్న భూమా కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్ గా జగన్ నియమించారని... ఇది అత్యంత దారుణమని అన్నారు. కేవలం హిందువులనే టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఏపీలోని హిందువులు మేల్కోవాలని... లేకపోతే నష్టం తప్పదని అన్నారు. ఏపీలో హిందువులు చేసే పోరాటాలకు తాము అండగా ఉంటామని చెప్పారు.
Raja Singh
BJP
Jagan
Bhumana Karunakar Reddy
YSRCP
TTD

More Telugu News