Mahesh Babu: 'గుంటూరు కారం'లో మరో మార్పు.. ఈసారి సినిమాటోగ్రాఫర్

Guntur Karam cinematographer changed

  • పీఎస్‌ వినోద్ స్థానంలో మనోజ్ పరమహంస
  • మహేశ్ బాబు–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా
  • హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి దీక్షిత్

మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' సినిమా తరచూ వార్తల్లో నిలుస్తోంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి అంతర్గత సమస్యలు సినిమాను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి పలువురు వరుసగా తప్పుకుంటున్నారు. ఈ జాబితాలో సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ కూడా ఉన్నారు. చిత్రీకరణ మధ్యలో ఉండగానే ఆయన సినిమా నుంచి వైదొలిగారు. ఇప్పుడు ఆయన స్థానంలో చిత్ర బృందం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. పలు భారీ ప్రాజెక్టులకు పని చేసిన ఆయన ప్రభాస్ హీరోగా నటించిన 'రాధే శ్యామ్' కి సినిమాటోగ్రాఫర్ గా చేశాడు. 

విజయ్ జోసెఫ్ నటించిన తమిళ చిత్రం 'బీస్ట్' కి కూడా పని చేశాడు. ప్రస్తుతం విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో రాబోతున్న 'లియో', గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న 'ధ్రువ నచ్చతిరం' (తెలుగులో ధ్రువ నక్షత్రం) సినిమాలకు కూడా పని చేస్తున్నారు. కాగా, వినోద్ స్థానంలో మనోజ్‌ను తీసుకున్నట్టు 'గుంటూరు కారం' చిత్ర బృందం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా తదుపరి షెడ్యూల్‌ ఈ నెల మూడో వారంలో మొదలవనుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.

Mahesh Babu
gunturu karam
Trivikram Srinivas
  • Loading...

More Telugu News