Bhola Shankar: "తీను మారు" అంటూ చిందేసిన 'భోళాశంకర్'... మరో మెగా పాట విడుదల

Teenumaaru song from Bhola Shankar out now

  • చిరంజీవి, మెహర్ రమేశ్ కాంబోలో భోళా శంకర్
  • ఆగస్టు 11న రిలీజ్
  • తాజాగా హుషారైన పాటను పంచుకున్న చిత్రబృందం
  • మహతి స్వరసాగర్ బాణీలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం
  • రాహుల్ సిప్లిగంజ్ గానం

టాలీవుడ్ లో భోళా శంకర్ మేనియా పెరిగిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేశ్ కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ ఎంటర్టయినర్ మూవీ 'భోళా శంకర్' ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ లోపే మెగా అభిమానులను ఉర్రూతలూగించేలా 'తీనుమారు' అనే హుషారైన గీతాన్ని చిత్రబృందం ఈ సాయంత్రం విడుదల చేసింది. ఈ పాట లిరికల్ వీడియో లింకును చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్లో పంచుకున్నారు. 

మహతి స్వరసాగర్ బాణీలు సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు. 

ఏకే ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర తెరకెక్కించిన 'భోళా శంకర్' నుంచి ఇప్పటివరకు రిలీజైన పాటలన్నీ ఆడియన్స్ లోకి బాగా చొచ్చుకుని వెళ్లాయి. ఈ పాట కూడా మెగా స్టయిల్లోనే ఉండడంతో అభిమానుల నుంచి విశేష స్పందన వస్తుందని చిత్రబృందం భావిస్తోంది. 

ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ కాగా, చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ కీలకపాత్రలో నటించింది. సుశాంత్, తరుణ్ అరోరా, మురళి శర్మ, వెన్నెల కిశోర్, సితార, శ్రీముఖి, హైపర్ ఆది, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, ఉత్తేజ్, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ శుక్రవారం నాడు భోళా శంకర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది.

Bhola Shankar
Teenumaaru
Lyrical Video
Chiranjeevi
Meher Ramesh
Mahati Swara Sagar
Kasarla Shyam
Rahul Sipligunj
AK Entertainments
Tollywood

More Telugu News