Adimulapu Suresh: ప్రకాశం జిల్లాకు చంద్రబాబు, లోకేశ్ ఏం చేశారంట?: మంత్రి ఆదిమూలపు

Adimulapu Suresh take a jibe at Chandrababu

  • ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధం ప్రకటించానంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్న మంత్రి  
  • టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండకు ఏంచేశారన్న ఆదిమూలపు
  • చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చేది ఎన్నికలప్పుడేనని ఎద్దేవా 
  • రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ వైపే ఉన్నారని వెల్లడి

ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాజెక్టుల అంశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శలపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఘాటుగా స్పందించారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధం ప్రకటించానంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని కొట్టిపారేశారు. 

రైతులను మోసం చేసింది చంద్రబాబు కాదా? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండను పట్టించుకోకుండా, ఇప్పుడు మాట్లాడతారా? ప్రకాశం జిల్లాకు చంద్రబాబు, లోకేశ్ ఏంచేశారంట? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చేది కేవలం ఎన్నికలప్పుడేనని మంత్రి ఆదిమూలపు విమర్శించారు. చంద్రబాబు వ్యవస్థలపై యుద్ధం ప్రకటించారని, అలజడులు సృష్టించి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. 

ఏపీలో ప్రాజెక్టులు ప్రారంభించింది, పూర్తి చేసింది వైఎస్సార్ అని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిష్ప్రయోజనమేనని అన్నారు.

Adimulapu Suresh
Chandrababu
Nara Lokesh
Prakasam District
YSRCP
TDP
  • Loading...

More Telugu News