Samantha: చిన్మయి పిల్లలతో ఆటలాడిన సమంత.. వీడియోలు ఇవిగో!

Samantha plays with singer Chinmayi children

  • బాలి నుంచి తిరిగొచ్చిన సమంత
  • చెన్నైలో చిన్మయి ఇంటికి వెళ్లిన సామ్
  • ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ఇటీవల సమంత ప్రకటన

అగ్ర సినీనటి సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న ఆమె చికిత్స కోసం ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ఇటీవల ప్రకటించింది. తన స్నేహితులతో కలసి బాలి పర్యటనకు వెళ్లి అక్కడ సేద తీరింది. తాజాగా చెన్నైకి తిరిగి వచ్చింది. తన స్నేహితురాలు, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఇంటికి వెళ్లింది. చిన్మయి పిల్లలతో కలిసి ఆటలాడుతూ సందడి చేసింది. పిల్లలతో 'నాటునాటు' పాటకు స్టెప్పులు వేయించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Samantha
Tollywood
Chinmayi

More Telugu News