Alia Bhatt: ఆగస్టు 11న ఓ రేంజ్ లోనే ఓటీటీ సెంటర్స్ లో సందడి!

OTT Movies and Web Series Update

  • ఈ శుక్రవారం సందడిగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ 
  • సోనీ లివ్ లో 'పోర్ తొళిల్' మూవీ 
  • జీ 5లో 'ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్'
  • నెట్ ఫ్లిక్స్ లో 'హార్ట్ ఆఫ్ స్టోన్'
  • అదే ఫ్లాట్ ఫామ్ పై అదే రోజున 'పద్మిని' మలయాళ మూవీ

తమిళంలో ఈ మధ్య కాలంలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలలో 'పోర్ తోళిల్' ఒకటిగా కనిపిస్తుంది. అశోక్ సెల్వన్ హీరోగా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా, తమిళంలో పెద్ద హిట్. అలాంటి ఈ సినిమా, ఈ నెల 11వ తేదీ నుంచి 'సోనీ లివ్' లో స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ 5 ఫ్లాట్ ఫామ్ పైకి ఆగస్టు 11వ తేదీనే 'ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి, ఈ కథకు మరిన్ని కొత్త అంశాలను జోడించి వెబ్ సిరీస్ గా రూపొందించాడు. భావోద్వేగాలతో సాగే ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలియాభట్ ప్రధానమైన పాత్రను పోషించిన 'హార్ట్ ఆఫ్ స్టోన్' సినిమా ఈ నెల 11వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇక ఇదే రోజున మలయాళ సినిమా 'పద్మిని' కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో కుంచాకో బోబన్ .. అపర్ణ బాలమురళి .. మడోన్నా సెబాస్టియన్ ప్రధానమైన పాత్రలను పోషించారు..

More Telugu News