Tilak Varma: తిలక్ తొలి హాఫ్ సెంచరీ రోహిత్ కూతురికి అంకితం
![Tilak Varma dedicates his maiden T20I fifty celebration to Rohit Sharmas daughter Samaira](https://imgd.ap7am.com/thumbnail/cr-20230807tn64d0a78638f99.jpg)
- వెస్టిండీస్ తో రెండో టీ20లో 51 పరుగులు చేసిన తిలక్ వర్మ
- టీ20ల్లో అతడికి ఇదే తొలి అర్ధ సెంచరీ
- హామీ ప్రకారం రోహిత్ కుమార్తె సమైరాకి అంకితం ఇస్తున్నట్టు ప్రకటన
తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ ఓ చిన్న పనితో నలుగురికీ ఆదర్శవంతంగా నిలిచాడు. వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్ లో 41 బంతుల్లో వర్మ 51 పరుగులు సాధించాడు. భారత జట్టులో టాప్ స్కోరర్ వర్మ ఒక్కడే. తెలుగు తేజం మెరిసినప్పటికీ.. వెస్టిండీస్ వైపు నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్ తో రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ కు ఓటమి తప్పలేదు.