Teaser Release: ప్యూర్ లవ్ స్టోరీగా 'మదిలో మది' .. టీజర్ రిలీజ్

Madilo Madi teaser released

  • మరో ప్రేమకథా చిత్రంగా 'మదిలో మది'
  • కొత్త నటీనటుల పరిచయం 
  • ఆసక్తిని పెంచుతున్న టీజర్ 
  • ఆగస్టు 18వ తేదీన సినిమా విడుదల

జై .. శీను .. స్వీటీ .. సిరి రావుల చారి .. సునీత .. ప్రధాన పాత్రల్లో నటించిన అందమైన ప్రేమ కథ చిత్రం ‘మదిలో మది’. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు ప్రకాశ్ పల్ల దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను 'బేబి' మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా ఈ  సినిమా టీజర్ ను తాగుబోతు రమేష్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఆయన మాట్లాడుతూ.. 'మదిలో మది' టీజర్‌ను చూశాను. ఎంతో ప్రామిసింగ్‌గా ఉంది. మంచి కంటెంట్‌తో యంగ్ బ్లడ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో టీజర్ అలా కనిపించింది. మేకింగ్ గొప్పగా .. జెన్యూన్‌గా కథ చెప్పినట్టుగా అనిపిస్తుంది.  ప్రేక్షక దేవుళ్లంతా కూడా ఇలాంటి కొత్త టీమ్ ను ఆశీర్వదించాలి. ఆగస్టు 18న థియేటర్లోకి రాబోతోన్న ఈ సినిమాను అందరూ చూడాల'ని కోరుకుంటున్నాను" అన్నారు. 

62 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ప్రేమ తాలుకు బాధను, సంతోషాన్ని చూపించారు. స్వచ్ఛమైన ప్రేమకథను చూపించినట్టుగా కనిపిస్తోంది. ప్రేమకథా చిత్రాలకు అద్భుతమైన సంగీతం, ఆర్ ఆర్ ప్రధాన ఆకర్షణలు అవుతాయి. ఈ టీజర్‌లో నేపథ్య సంగీతం అందరినీ మెప్పిస్తుంది. విజువల్స్ ఎంతో సహజంగా కనిపించాయి. ప్యూర్ లవ్ స్టోరీ అంటూ ట్యాగ్ పెట్టడంతోనే ఈ సినిమా కథ ఎలా ఉంటుందో అంచనాకు వచ్చిన ప్రేక్షకుడికి, టీజర్‌తో క్లారిటీ ఇచ్చారు ... సినిమా మీద అంచనాలు పెంచేశారు.

Teaser Release
Madilo Madi
Jai
Srinu
Sunitha

More Telugu News