Chiranjeevi: అటు 'జైలర్' .. ఇటు 'భోళా శంకర్'!

Jailer and Bhola Shankar movies update

  • ఈ నెల 10వ తేదీన రానున్న 'జైలర్'
  • ఫస్టు లుక్ నుంచి అంచనాలు పెంచేసిన రజనీ
  • భారీ తారాగణమే ప్రధానమైన ఆకర్షణ  
  • 11వ తేదీన భారీస్థాయిలో 'భోళాశంకర్' విడుదల
  • మాస్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతున్న సినిమా


ఈ నెలలో రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకటి రజనీకాంత్ 'జైలర్' అయితే .. మరొకటి చిరంజీవి 'భోళా శంకర్'. రజనీకాంత్ ను తమిళ హీరోగా చూడలేము. ఎందుకంటే ఆయన తన కెరియర్ ఆరంభంలో నేరుగా తెలుగు సినిమాలు చేయడమే కాదు, అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమా  తమిళంతో పాటు తెలుగులోను విడుదల అవుతోంది. అలా ఆయన తాజా చిత్రమైన 'జైలర్' ఈ నెల 10వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను ప్రేక్షకులను పలకరించనుంది. రజనీ లుక్ దగ్గర నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశం అంచనాలు పెంచుతూ వెళుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. వివిధ భాషలకి చెందిన సీనియర్ స్టార్ హీరోలు ప్రత్యేక పాత్రలలో కనిపించనుండటం ఈ సినిమా విశేషం. ఇక ఈ నెల 11వ తేదీన 'భోళాశంకర్' సినిమా విడుదల కానుంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. చిరంజీవి మాస్ లుక్ .. ఆయన మాస్ యాక్షన్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఒక రోజు గ్యాప్ తో ఇటు మెగా స్టార్ .. అటు సూపర్ స్టార్ సినిమాలు థియేటర్లకు వస్తుండటం విశేషం.

Chiranjeevi
Mehar Ramesh
Rajanikanth
Nelson Dileep Kumar
  • Loading...

More Telugu News