Balakrishna: పాటలతో ప్రజా ఉద్యమాలు నడిపిన విప్లవకారుడు గద్దర్: బాలకృష్ణ

Balakrishna reacts to Gaddar demise

  • గద్దర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బాలకృష్ణ
  • గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి 
  • ప్రజా ఉద్యమ పాటలంటే గద్దరే గుర్తుకు వస్తారన్న బాలకృష్ణ

జన ఉద్యమకారుడు గద్దర్ మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. పాటలతో ప్రజా ఉద్యమాలు నడిపిన విప్లవకారుడు గద్దర్ అని అభివర్ణించారు. ప్రజా ఉద్యమ పాటలంటే గద్దరే గుర్తుకు వస్తారని తెలిపారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నానని బాలకృష్ణ వెల్లడించారు. 

గద్దర్ మృతి విచారకరం: అచ్చెన్నాయుడు

ప్రజాగాయకుడు గద్దర్ మృతి పట్ల టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం గద్దర్ కృషి చేశారని కొనియాడారు. గద్దర్ మృతితో ప్రశ్నించే స్వరం మూగబోయిందని పేర్కొన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Balakrishna
Gaddar
Demise
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News