Hazara Express: పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం... రైలు పట్టాలు తప్పడంతో 25 మంది మృతి

25 Dead in Pakistan train accident

  • పట్టాలు తప్పిన హజారా ఎక్స్ ప్రెస్ లోని 10 బోగీలు
  • కరాచీ నుంచి రావల్పిండి వెళుతున్న రైలు
  • షహారా స్టేషన్ వద్ద ఘటన

పాకిస్థాన్ లో ఓ రైలు పట్టాలు తప్పడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హజారా ఎక్స్ ప్రెస్ కు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 25 మంది మృతి చెందారు. 80 మందికి పైగా గాయపడ్డారు. హజారా ఎక్స్ ప్రెస్ కరాచీ నుంచి రావల్పిండి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. 

షాజాద్ పూర్, నవాబ్ షా ప్రాంతాల మధ్య షహారా రైల్వే స్టేషన్ కు సమీపానికి రాగానే రైలు పట్టాలు తప్పింది. కాగా, పట్టాలు తప్పిన బోగీల్లో చాలామంది చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Hazara Express
Pakistan
Train Accident
Rawalpindi
Karachi
  • Loading...

More Telugu News