YV Subba Reddy: లీగల్ ఇష్యూ కారణంగానే విశాఖ రాజధాని ఆలస్యం: వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy says CM Jagan will come to Visakha soon
  • త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కానుందన్న వైసీపీ నేత
  • సీఎం జగన్ మూడు నెలల్లో విశాఖకు రానున్నట్లు వెల్లడించిన వైవీ
  • దక్షిణ భారత్‌కు విశాఖ ముంబై వంటిదని వ్యాఖ్య
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కానుందన్నారు. లీగల్ ఇష్యూస్ కారణంగా రాజధానిగా విశాఖ ఆలస్యమవుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు నెలల్లో విశాఖకు రానున్నట్లు చెప్పారు. దక్షిణ భారత దేశానికి ముంబై వంటిది విశాఖ అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు జీవించేందుకు ఇది అనువైన ప్రాంతమని చెప్పారు. విశాఖ అభివృద్ధిలో అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం ఉందన్నారు.  
YV Subba Reddy
Visakhapatnam District
Vizag
YS Jagan

More Telugu News