Pavitra Lokesh: ఎంట్రన్స్ పరీక్షలో పాస్ అయిన పవిత్ర లోకేశ్

Actor Pavitra Lokesh passed in entrance exam

  • మరోసారి వార్తల్లోకి ఎక్కిన పవిత్ర లోకేశ్
  • పీహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయిన పవిత్ర
  • కన్నడలో పీహెచ్డీ చేయాలనే కోరిక ఉందని గతంలోనే చెప్పిన పవిత్ర

ఇటీవలి కాలంలో సినీ రంగంలో బాగా పాప్యులర్ అయిన వ్యక్తి నటి పవిత్ర లోకేశ్. సీనియర్ నటుడు నరేశ్ తో ఆమె సహజీవనం బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కారు. కన్నడ యూనివర్శిటీ నిర్వహించిన పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ పరీక్షలో ఆమె పాస్ అయ్యారు. కన్నడ యూనివర్శిటీ వివిధ విభాగాల కింద పీహెచ్డీ చేయడానికి అవకాశం కల్పిస్తోంది. వివిధ విభాగాల్లో పీహెచ్డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్ పరీక్ష రాయగా... వీరిలో 259 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 

తనకు కన్నడలో పీహెచ్డీ చేయాలనే కోరిక ఉండేదని గతంలోనే పవిత్ర చెప్పారు. ఇందులో భాగంగా బెల్గాం ఎక్స్ టెన్షన్ సెంటర్ లో పరిశోధన చేసేందుకు పవిత్ర పరీక్ష రాశారు. మే 30న ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. మరోవైపు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయిన పవిత్రకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Pavitra Lokesh
Tollywood
Entrance Exam
  • Loading...

More Telugu News