mutual funds: ఏడాదిలో 22 శాతం రాబడినిచ్చిన మ్యూచువల్ ఫండ్స్

These mutual funds gave up to 22 percent returns in one year

  • ఈక్విటీ, డెట్ కలయికతో ఉండే హైబ్రిడ్ ఫండ్స్
  • వీటిల్లో రిస్క్ తక్కువ, రాబడి ఎక్కువ
  • పన్ను పరంగానూ వీటితో ప్రయోజనం

మంచి రాబడి కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయంలో కొందరిలో ఎంతో అస్పష్టత నెలకొని ఉంటుంది. ఏ ఇతర సాధనంతో పోల్చి చూసినా ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇస్తాయని చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈక్విటీల తర్వాత రియల్ ఎస్టేట్ కూడా మంచి రాబడినే ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈక్విటీలకు మించిన అద్భుత రాబడులు రియల్టీలో సాధ్యపడతాయి. కాకపోతే రియల్ ఎస్టేట్ లో లిక్విడిటీ (వెంటనే విక్రయించుకోవడం) కష్టంగా ఉంటుంది. చాలా సులభంగా ఇన్వెస్ట్ చేసి, వెనక్కి తీసుకోవడం ఈక్విటీలతోనే సాధ్యం. మరి ఈక్విటీల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయడం కంటే మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో వెళ్లడం సూచనీయం. 

మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. వేలాది పథకాల నుంచి మంచి ఫండ్ ను ఎంపిక చేసుకోవడం ఎలా?  ఇది ఒక్క పెద్ద టాస్క్. అందుకే అందుబాటులోని గణాంకాల ఆధారంగా గడిచిన ఏడాది కాలంలో మంచి రాబడులను ఇచ్చిన పథకాల వివరాలు ఇవి..

పథకం 
ఏడాది రాబడి  (శాతం)
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ 
21.90 
ఎడెల్వీజ్ అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ 
 20
హెచ్ డీఎఫ్ సీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ 
19.50 
నిప్పన్ ఇండియా ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ 
19.50 
యూటీఐ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ 
 18.80
ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ 
 17.10
మహీంద్రా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ 16.90 
టాటా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ 16.20 
కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ 
15.80 
అనుకూలతలు 
ఈక్విటీ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ను ఈక్విటీ ఫండ్స్ గా పరిగణిస్తారు. కనుక వచ్చే లాభాలపై పన్ను ఈక్విటీలకు వర్తించే మాదిరే స్వల్పకాలంపై 15 శాతం, దీర్ఘకాలంపై (ఏడాది దాటిన) 10 శాతం చొప్పున చెల్లించాలి. అచ్చమైన డెట్ ఫండ్స్ అయితే వచ్చే రాబడి అంతా ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దీంతో అధిక పన్ను చెల్లంచాల్సి రావచ్చు. ఈక్విటీ పథకాలుగా పరిగణించినప్పటికీ.. ఈ పథకంలో మొత్తం పెట్టుబడులను ఈక్విటీల్లో పెట్టేయరు. 65 శాతం నుంచి 80 శాతం మధ్య ఈక్విటీలకు, 20-35 శాతం మధ్య డెట్ కు కేటాయిస్తుంటారు. కనుక రిస్క్ తక్కువ, రాబడులు ఎక్కువగా ఉంటాయి.

  • Loading...

More Telugu News