Rashmika Mandanna: జీవితకాలం అతన్నే ప్రేమిస్తుంటా: రష్మిక మందన్న

I love him forever says Rashmika Mandanna

  • ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న రష్మిక
  • ఆమె పెళ్లి గురించి ప్రశ్నించిన ముంబై పాత్రికేయులు
  • నరుటో అనే వ్యక్తితో ఎప్పుడో పెళ్లయిపోయిందన్న కన్నడ బ్యూటీ

'పుష్ప' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న బాలీవుడ్ లో బిజీ అయింది. తెలుగుతో పాటు హిందీలో సైతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ముంబైలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఆమెకు ఎదురయింది. దీనికి ఆమె సరదాగా సమాధానం ఇచ్చింది. 

తనకు నరుటో అనే వ్యక్తితో ఎప్పుడో పెళ్లయిపోయిందని ఆమె చెప్పింది. జీవితకాలం అతడినే ప్రేమిస్తుంటానని తెలిపింది. ఈ నరుటో ఎవరో అని మీడియా ప్రతినిధులు కాసేపు అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత జపనీస్ కార్టూన్ వెబ్ సిరీస్ హీరో నరుటో అని తెలుసుకుని నవ్వుకున్నారు. మరోవైపు ప్రస్తుతం 'పుష్ప 2', 'రెయిన్ బో' చిత్రాల్లో రష్మిక నటిస్తోంది.

Rashmika Mandanna
Tollywood
Bollywood
Marriage
  • Loading...

More Telugu News