chennai temple: టమాటా ధరలు తగ్గాలంటూ తమిళనాడులో అమ్మవారికి పూజలు

A special pooja at chennai temple with garlands of 508 tomatoes to reduce the price

  • 508 టమాటాలతో మరియమ్మన్ కు దండ
  • నాగపట్టినం జిల్లా కురుకుడిలో ప్రత్యేక పూజలు
  • ఆడి నెల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ

మార్కెట్లో టమాటాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. మండుతున్న రేట్లకు భయపడి సామాన్యుడు వాటివైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టమాటాల ధరలు తగ్గేలా చూడాలంటూ తమిళనాడు భక్తులు కొంతమంది అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడులోని నాగపట్టినం జిల్లా కురుకుడిలో మహా మరియమ్మన్, నాగమ్మన్ ఆలయం ప్రసిద్ధి పొందింది. చుట్టుపక్కల జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం ఆడి నెల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

టమాటాల ధర తగ్గించు తల్లీ అంటూ మొక్కుకున్నారు. ప్రత్యేకంగా 508 టమాటాలతో మాల తయారుచేసి అమ్మవారికి అలంకరించారు. సాధారణంగా సంతానం కోసం, విద్య, ఆరోగ్యం కోసం, ఆర్థిక కష్టాలు తీర్చాలంటూ భక్తులు మొక్కుకుంటారు. అయితే, విపరీతంగా పెరిగిపోతున్న ధరల వల్ల టమాటాలు తినలేకపోతున్నామని కొంతమంది భక్తులు ఈ ప్రత్యేక పూజ చేశారు. టమాటాలతో అమ్మవారిని అలంకరించి ధరలు తగ్గించాలంటూ కోరుకున్నారు.

More Telugu News