chikoti praveen: ఢిల్లీలో బండి సంజయ్‌ని కలిసిన చీకోటి ప్రవీణ్.. త్వరలో బీజేపీలోకి?

casino king chikoti praveen meets bandi sanjay and dk aruna
  • రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న చీకోటి ప్రవీణ్
  • ఢిల్లీలో బండి సంజయ్, డీకే అరుణతో భేటీ
  • బీజేపీలో చేరేందుకే కలుస్తున్నారంటూ చర్చ
క్యాసినో గేమ్స్‌తో పాప్యులర్ అయ్యారు చీకోటి ప్రవీణ్. అలానే ఎన్నో వివాదాల్లోనూ చిక్కుకున్నారు. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ఈడీ కేసులనూ ఎదుర్కొంటున్నారు. ఇటీవల బోనాల పండుగ సందర్భంగా ప్రైవేటు గన్‌మన్లను వెంటబెట్టుకుని లాల్‌ దర్వాజ అమ్మవారి దర్శనానికి వెళ్లి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బీజేపీ నేతలను వరుసగా కలుస్తున్నారు. అది కూడా ఢిల్లీలో భేటీ అవుతున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకే వరుసగా కలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ని ఢిల్లీలో చీకోటి ప్రవీణ్ కలిశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతోనూ ఆయన భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాదాస్పద తీరుతో, వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో ఉండే చీకోటి ప్రవీణ్‌ను బీజేపీ చేర్చుకుంటుందా? అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
chikoti praveen
Bandi Sanjay
DK Aruna
casino
BJP
Delhi

More Telugu News