Etela Rajender: అసెంబ్లీలో ఆఫీసు గది కూడా కేటాయించలేదు: ఈటల రాజేందర్

Etala Rajender fires on Telangana government
  • బీఏసీ భేటీకి బీజేపీని ఆహ్వానించలేదన్న ఈటల రాజేందర్
  • గతంలో ఏదైనా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా పిలిచేవారని వెల్లడి
  • సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ పాలకులకు లేదని మండిపాటు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీకి తమను ఆహ్వానించలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గతంలో ఏదైనా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరే బీఏసీ మీటింగ్‌కు పిలిచేవారని అన్నారు. ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ పాలకులకు లేదని మండిపడ్డారు.

అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారని, అయినా తమను బీఏసీ సమావేశానికి పిలవలేదని చెప్పారు. అసెంబ్లీలో చాలా గదులు ఖాళీగా ఉన్నా సరే.. తమకు ఆఫీసు గది కేటాయించలేదని తెలిపారు. ఇది కక్ష సాధింపేనని ఆరోపించారు. ఇదే అంశంపై స్పీకర్‌‌కు ఫోన్ చేసి అడిగినా సమాధానం లేదని వాపోయారు.
Etela Rajender
Telangana Assembly
BAC
BJP
BRS
Assembly media point

More Telugu News