Vaishnavi Chaitanya: 'బేబి' పాత్ర గురించి వినగానే భయపడ్డాను: వైష్ణవీ చైతన్య

Vaishnavi Chaitanya Interview

  • క్రితం నెలలో విడుదలైన 'బేబి' 
  • ఆ సినిమాతో పెరిగిపోయిన వైష్ణవి క్రేజ్
  • ముందుగా చేయనని చెప్పానని వెల్లడి 
  •  మేకర్స్ ధైర్యం చెప్పడం వలన చేశానని వ్యాఖ్య  

తెలుగు తెరపై ఇంతవరకూ సందడి చేస్తూ వచ్చిన హీరోయిన్స్ లో అంజలి .. స్వాతి రెడ్డి .. ఈషా రెబ్బా వంటివారు కనిపిస్తారు. 'బేబి' సినిమాతో మరో తెలుగు బ్యూటీగా వైష్ణవీ చైతన్య ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో వైష్ణవికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల జోరు ఇంకా కొనసాగుతూ ఉండటం విశేషం. 

ఈ సందర్భంగా తాజాగా 'ఐడ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవి మాట్లాడుతూ .. "ఈ కథను సాయిరాజేశ్ గారు నాకు చెప్పారు. నా పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన బెడ్ రూమ్ సీన్స్ గురించి చెప్పినప్పుడు భయపడ్డాను. ఈ సీన్ ను సెట్లో ఎలా చేయాలి? ఎలా వస్తుంది? ఇది బయటికి ఎలా వెళుతుంది? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే విషయంలో చాలా టెన్షన్ పడిపోయాను" అని అన్నారు. 

" నా భయాలన్నిటినీ నేను సాయిరాజేశ్ గారి ముందుంచాను. ఈ సినిమా నేను చేయను అని చెప్పాను. అప్పుడు ఆయన హీరోయిన్ స్వభావం .. ఆమె తీసుకునే నిర్ణయాలకు గల కారణాలను గురించి నాకు వివరంగా చెప్పారు. అప్పుడు ఆ సీన్స్ చేయడానికి నాకు ధైర్యం వచ్చింది. ఇలాంటి సీన్స్ చేయనున్నట్టు మా పేరెంట్స్ కి ముందే చెప్పాను. వాళ్లు కూడా ఓకే చెప్పిన తరువాతనే చేశాను" అని చెప్పుకొచ్చారు. 


Vaishnavi Chaitanya
Actress
Baby
Movie
  • Loading...

More Telugu News