Karthikeya: 'బెదురులంక 2012' నుంచి 'దొంగోడే దొరగాడు' సాంగ్ రిలీజ్!

Bedurulanka 2012 movie lyrical song released

  • కార్తికేయ హీరోగా రూపొందిన 'బెదురులంక 2012'
  • ఆయన సరసన మెరవనున్న 'డీజే టిల్లు' బ్యూటీ 
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • దర్శకుడిగా 'క్లాక్స్' పరిచయం   
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల

కార్తికేయ హీరోగా 'బెదురులంక 2012' సినిమా రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో హీరోయిన్ గా నేహా శెట్టి అలరించనుంది. అటు 'RX 100' హీరో .. ఇటు 'డీజే టిల్లు' బ్యూటీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో యూత్ లో ఆసక్తి పెరిగింది. 'క్లాక్స్' దర్శకత్వం వహించిన ఈ సినిమాను బెన్నీ నిర్మించాడు. 

ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసుకుని కొంతకాలమవుతోంది. సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చి, చివరికి ఈ నెల 25వ తేదీని ఖాయం చేసుకున్నారు. ఆ దిశగానే ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 

"లోకంలోన ఏ చోటైనా అందరొక్కటే .. ఎవడికాడు ఎర్రి బాగులోడు .. నిజమిదే" అంటూ ఈ పాట సాగుతోంది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించగా .. సాహితి చాగంటి ఆలపించారు. ఇతర ముఖ్య పాత్రల్లో అజయ్ ఘోష్ .. శ్రీకాంత్ అయ్యంగార్ .. రాజ్ కుమార్ కసిరెడ్డి కనిపిస్తున్నారు.

More Telugu News