Parrot: తప్పిపోయిన చిలుక.. పట్టిస్తే రూ. 10 వేల నజరానా!

MP man puts posters for his missing parrots giving Rs 10000 Reward for who finds

  • మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో ఘటన
  • ఊరంతా పోస్టర్లు వేయించి, మైకులతో ప్రచారం
  • చిలుక కనిపించకపోవడంతో కలత చెందిన కుటుంబం

తప్పిపోయిన తన చిలుకను పట్టి ఇచ్చినా, ఆచూకీ తెలిపినా 10 వేల రూపాయల నజరానా ఇస్తానంటూ ఓ వ్యక్తి ఊరంతా పోస్టర్లు వేసి మరీ ప్రకటించాడు. అంతేకాదు, ఆటోలకు మైకులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాకు చెందిన దీపక్ సోనీ కుటుంబం ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న రామచిలుక ఓ రోజు ఎటో వెళ్లిపోయింది. గతంలో ఒకసారి ఇలాగే ఎగిరిపోయినా మళ్లీ దానంతట అదే వచ్చింది. 

ఈసారి రోజులు గడుస్తున్నా రాకపోవడంతో కలత చెందిన కుటుంబం దానిని వెతికి పట్టి ఇచ్చిన వారికి రూ. 10 వేల నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు దీపక్ సోనీ పోస్టర్లు ప్రింట్ చేయించి ఊరంతా అతికించాడు. ఆటోకు మైకు పెట్టి ప్రచారం చేస్తున్నాడు. ఆ చిలుకంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. చిలుక సరిగా ఎగరలేకపోతోందని, వీధి కుక్కలు దానికేమైనా హాని తలపెట్టాయేమోనని ఆందోళన చెందుతున్నాడు.

  • Loading...

More Telugu News