Sai Rajesh: నా లైఫ్ స్టోరీ 'బేబి' కాదు .. 'కలర్ ఫొటో' : డైరెక్టర్ సాయిరాజేశ్

Sai Rajesh Interview

  • దర్శకుడి ప్రేమకథనే 'బేబి' అంటూ ప్రచారం 
  • అందులో నిజం లేదని చెప్పిన సాయిరాజేశ్ 
  • తన రియల్ లైఫ్ స్టోరీ 'కలర్ ఫొటో' అంటూ స్పష్టీకరణ 
  • నల్లగా ఉన్నాననే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తనకి ఉందని వెల్లడి

'బేబి' సినిమా దర్శకుడిగా సాయిరాజేశ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతకుముందు ఆయన 'కలర్ ఫొటో' సినిమాకి ఒక నిర్మాతగా కూడా ఉన్నారు. అటు 'కలర్ ఫొటో' .. ఇటు 'బేబి' .. ఈ  రెండు సినిమాలు కూడా ప్రేమకథా చిత్రాలే. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలను గురించి సాయిరాజేశ్ ప్రస్తావించాడు.

"చాలామంది 'బేబి' కథ మీ లైఫ్ లో మీకు ఎదురైన సమస్యనా? అని అడిగారు. ఇది నా లైఫ్ స్టోరీ అనే ప్రచారం కూడా బయట జరుగుతోంది. కానీ అలాంటిదేం లేదు .. నిజానికి నా లైఫ్ స్టోరీ 'బేబి' కాదు .. 'కలర్ ఫొటో'. చివరి 20 నిమిషాలు మినహా ఇస్తే, మిగతా సన్నివేశాలన్నీ నా లైఫ్ లో జరిగినవే. నా మనసులో నేను అనుకున్న మాటలను ఆ సినిమాలో సుహాస్ తో చెప్పించాను కూడా అన్నాడు. 

"నేను .. మా ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం .. పదో తరగతి చివర్లోనే మేము లవ్ లో పడిపోయాము. ఇంటర్లోకి వచ్చేసరికి మా మధ్య ప్రేమ మరింత పెరిగింది. ఆ సమయంలో మా ఆవిడను ఎక్కడో దాచేశారు .. అందువలన లవ్ లో పెయిన్ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. నేను బాగోను .. నల్లగా ఉంటాననే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాలో ఉండేది. అయినా మా ఆవిడ నన్ను లవ్ చేసింది. ఆ పాయింట్ తోనే ఆ కథ పుట్టుకొచ్చింది" అని చెప్పాడు.

Sai Rajesh
Director
Baby
Colour Photo
  • Loading...

More Telugu News