naresh: సినీ నటుడు నరేశ్‌కు కోర్టులో డబుల్ రిలీఫ్

Actor Naresh gets relief in court

  • రమ్య రఘుపతి రాకూడదంటూ న్యాయస్థానం ఆదేశాలు
  • మళ్లీ-పెళ్లి సినిమా విషయంలోను నరేశ్‌కు ఊరట
  • మూడో భార్య పిటిషన్‌ను కొట్టివేసిన బెంగళూరు కోర్టు

సినీ నటుడు నరేశ్‌కు కోర్టులో బుధవారం ఊరట లభించింది. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని నరేశ్ ఇంట్లోకి రమ్యరఘుపతిని రాకుండా చూడాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు గతంలో కోర్టులో దావా వేశారు. కేసును విచారించిన న్యాయస్థానం... నరేశ్ ఇంట్లోకి రమ్య రాకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. నరేశ్, ఆయన మూడో భార్య రమ్యరఘుపతి కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. నటి పవిత్రా లోకేశ్‌తో నరేశ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో నరేశ్ సన్నిహితంగా ఉండటాన్ని రమ్య ప్రశ్నించారు. మీడియా ముందుకూ వచ్చారు.

మరోవైపు, పవిత్ర లోకేశ్-నరేశ్ కలిసి తీసిన మళ్లీ పెళ్లి సినిమా తన వ్యక్తిగత జీవితాన్ని పోలి ఉందని, తనను ఈ సినిమాలో టార్గెట్ చేశారని ఆమె కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని దావా వేశారు. అయితే ఈ కేసులోనూ బెంగళూరులోని సివిల్ కోర్టులో నరేశ్‌కు ఊరట లభించింది. 

మళ్లీ పెళ్లి సినిమాపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మెరిట్ లేని కారణంగా రమ్య రఘుపతి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సెన్సార్ బోర్డు చెప్పినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు పేర్కొంది. అలాగే సెన్సార్ బోర్డు ఒక చిత్రాన్ని కల్పితమని సర్టిఫై చేస్తే దాని విడుదలను ప్రయివేటు వ్యక్తులు అడ్డుకోలేరని కోర్టు స్పష్టం చేసింది.

naresh
pavitra lokesh
ramya raghupathi
Tollywood
  • Loading...

More Telugu News