Vijay Varma: 'కాల్ కూట్' క్లైమాక్స్ చూడవలసిందే!

Kaalkoot  Web Series Update

  • జియో సినిమాలో 'కాల్ కూట్'
  • 8 ఎపిసోడ్స్ తో వచ్చిన ఫస్టు సీజన్
  • ఆసక్తిని రేకెత్తించే పోలీస్ డ్రామా
  • ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే క్లైమాక్స్  

జియో సినిమాలో 'కాల్ కూట్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. విజయ్ వర్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ వెబ్ సిరీస్, అమ్మాయిలపై జరిగే యాసిడ్ దాడుల నేపథ్యంలో నడుస్తుంది. సునీత్ సక్సేనా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 1లో భాగంగా 8 ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ చేశారు. ఈ రోజునే 8వ ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చింది. 

పారుల్ అనే ఒక యువతిపై యాసిడ్ దాడి జరుగుతుంది. ఆ యువతి చావుబతుకుల్లో హాస్పిటల్లో ఉంటుంది. ఈ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ రవిశంకర్ త్రిపాఠి రంగంలోకి దిగుతాడు. పారుల్ ఎవరితో చనువుగా ఉండేదనే విషయంలో ఆమె పేరెంట్స్ సరైన సమాచారాన్ని ఇవ్వలేకపోతారు. అయినా రవిశంకర్ టీమ్ ఈ కేసు మూలలను తవ్వుతూ ముందుకు వెళుతుంది. పారుల్ పై ఎవరు యాసిడ్ పోసి ఉంటారనే విషయంలో కొన్ని పాత్రలపై అనుమానం తలెత్తుతుంది. 

ఈ రోజున అందుబాటులోకి వచ్చిన క్లైమాక్స్ ఎపిసోడ్ అందరిలో మరింత ఆసక్తిని పెంచుతుంది. అసలు నేరస్థుడు ఎవరనేది తెలుసుకుని వెళ్లిన పోలీస్ టీమ్ కి అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఆడియన్స్ గెస్ చేయలేరు. ఈ ఎపిసోడ్ పోలీస్ డిపార్టుమెంటుపై అభిమానాన్ని .. గౌరవాన్ని పెంచేదిగా ఉంటుంది. మొదటి నుంచి చివరివరకూ ఎక్కడా ఎలాంటి అసభ్యత కనిపించదు .. వినిపించదు.  ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి పోలీస్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ ను గురించి చెప్పుకోవచ్చు. 

More Telugu News