priyamani: దండుపాళ్యంను మించేలా ఉన్న సన్నీ లియోన్, ప్రియమణి ‘కొటేషన్ గ్యాంగ్’

Quotation Gang Teaser out with power packed thriller

  • టీజర్ విడుదల చేసిన చిత్ర బృందం
  • కిరాయి హత్యల ముఠాల కథతో క్యూజీ
  • మూడు భాషల్లో విడుదల కానున్న చిత్రం 

పెళ్లయినా కూడా నటనకు బ్రేక్‌ ఇవ్వకుండా ప్రియమణి వరుస సినిమాలతో బిజీగా ఉంది. వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌ లలో నటిస్తూ ముందుకెళ్తోంది. ప్రియమణి, సన్నీ లియోన్‌, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘క్యూజీ’. కొటేషన్ గ్యాంగ్ అనేది పూర్తి టైటిల్. ఇది లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రం తెలుగు టీజర్ ను తాజాగా విడుదల చేశారు. పూర్తి హింసాత్మక సన్నివేశాలతో ఉన్న ట్రైలర్ ను చూస్తే ఇది కిరాయి హత్యల ముఠాలకు సంబంధించిన చిత్రంలా కనిపిస్తోంది. 

చెన్నై, ముంబై, కశ్మీర్ ప్రాంతాల్లో జరిగే సంఘటనలతో ఆ మూడు ప్రాంతాలకు మధ్య సాగే గ్యాంగ్ వార్ కథ అని తెలుస్తోంది. సన్నివేశాలు చూస్తుంటే ఇది దండుపాళ్యం సినిమాను మించేలా తలపిస్తోంది. ప్రముఖ దర్శకుడు బాల శిష్యుడు వివేక్ కె కన్నన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. గాయత్రి రెడ్డి, సారా అర్జున్ తదితరులు నటించిన ఈ సినిమాకు డ్రమ్స్ శివమణి మ్యూజిక్ అందించారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


priyamani
Sunny Leone
Quotation Gang
Teaser

More Telugu News